శారదా పీఠానికి రెండెకరాల భూమి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

  • దర్శకుడు ఎన్.శంకర్ కు ఐదెకరాల భూమి
  • తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
తెలంగాణ సీఎం కేసీఆర్ కు విశాఖ శారదా పీఠం అన్నా, పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నా ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్ననే విజయవాడలో శారదా పీఠం ఉత్తరాధికారి నియామక కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజరై తన ఆధ్యాత్మిక గురువు దీవెనలు అందుకున్నారు. స్వరూపానంద ఆధ్వర్యంలోనే ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో, శారదా పీఠానికి తెలంగాణలో స్థలం కేటాయించాలని కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. శారదా పీఠానికి రెండెకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, తెలంగాణ సినీ దర్శకుడు ఎన్.శంకర్ కు స్టూడియో నిర్మాణం కోసం మోకిళ్ళ వద్ద 5 ఎకరాల భూమి ఇవ్వాలని కూడా తీర్మానించారు.
Go Back to Shorts
KCR
Sharada Peetham
Telangana
Hyderabad

More Telugu News